కలం, వెబ్ డెస్క్: భారత యువ హాకీ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దే లక్ష్యంతో హాకీ ఇండియా ప్రత్యేకంగా భారత్-ఆస్ట్రేలియా అండర్-18 సిరీస్(U18 Hockey)కు తెరలేపింది. మే 29న జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ముందు మన క్రీడాకారులకు బలమైన ప్రత్యర్థితో ప్రాక్టీస్ లభించేలా ఈ టోర్నీని రూపొందించారు. మే 15 నుంచి 20 వరకు భోపాల్‌లోని సాయ్ (SAI) సెంటర్‌లో ఈ సిరీస్ జరగనుంది. గత నెల రోజులుగా మాజీ దిగ్గజ కెప్టెన్లు సర్దార్ సింగ్, రాణిల పర్యవేక్షణలో శిక్షణ పొందిన యువ జట్లు.. కేతన్ కుష్వాహ (పురుషుల జట్టు), స్వీటీ కుజూర్ (మహిళల జట్టు) సారథ్యంలో మే 15, 17, 18 తేదీల్లో ఆస్ట్రేలియాతో తలపడనున్నాయి.
యువ ఆటగాళ్లపై ఇప్పుడే దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో సీనియర్ జట్లకు నాణ్యమైన ప్లేయర్లు అందుతారని హాకీ ఇండియా చొరవను కోచ్ సర్దార్ సింగ్ అభినందించారు. అండర్-18 (U18 Hockey) స్థాయిలో ఆస్ట్రేలియా వంటి గట్టి జట్టుతో ఆడటం తమ క్రీడాకారులకు గొప్ప ఎక్స్‌పోజర్ అని కోచ్ రాణి పేర్కొన్నారు. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఆటగాళ్లందరినీ ఒక జట్టుగా ఏకం చేయడంపై దృష్టి పెట్టామని, ఆసియా కప్‌కు ముందు ఈ సిరీస్ తమ బలాబలాలు అంచనా వేసుకోవడానికి ఒక గొప్ప వేదిక అని కోచ్‌లు వివరించారు. యువ ఆటగాళ్ల నైపుణ్యాలను పదును పెడుతూ సాగుతున్న ఈ ప్రయాణం భారత హాకీకి భవిష్యత్తులో మేలు చేకూర్చనుంది.
Read Also: కోహ్లీ పరుగుల వేట.. అసలు రహస్యం ఇదే!
Follow Us On: Instagram

