కలం మెదక్ బ్యూరో: వరంగల్‌లో రైతుల మీద మీటింగ్ పెట్టే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతు సమస్యల గురించి చర్చ పెడితే శాసనసభ నుంచి తప్పించుకున్న బీఆర్ఎస్ వాళ్లు మీటింగ్ పెట్టి మాట్లాడటం పెద్ద జోక్ అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల గురించి చర్చించేందుకు అదే వేదిక మీద చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేశారని.. మల్లన్న సాగర్ , గౌరవెల్లి ప్రాజెక్టు రైతుల మీద విచక్షణ రహితంగా లాఠీఛార్జీ చేసిందని గుర్తు చేశారు.
‘రైతులకు బేడీలు వేశారు..?’
తమ ప్రభుత్వం వ్యవసాయంపై సదస్సులు నిర్వహిస్తూ రైతులకు శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పిస్తోందని, సబ్సిడీ ద్వారా అధునాతన యంత్రాలు అందించి రైతు భరోసా ఇస్తున్నట్లు మంత్రి పొన్నం వివరించారు.. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు సరికావన్నారు. ధాన్యం కొనుగోళ్లు మొక్కజొన్న, వరి కొనుగోళ్లకు సంబంధించి రోజూ సీఎం, సంబంధిత మంత్రి, చీఫ్ సెక్రటరీ సమీక్షిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి గింజ కొంటుందని భరోసానిచ్చారు.

