కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లలగడ్డ వద్ద అర్బన్ ఫారెస్ట్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎల్లమ్మ చెరువు , మహా సముద్రం గండి , రాయికల్ వాటర్ ఫాల్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను టూరిజం స్పాట్స్ గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ‘ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రకు సాక్ష్యంగా కోటలు ఉన్నాయి. భైరవ స్వామి గుడి .. సర్వాయి పాపన్న కోటలు టూరిజం పరంగా అభివృద్ధి చేసి ట్రెక్కింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి పర్యటక ప్రాంతంగా హుస్నాబాద్ ను అభివృద్ధి చేద్దాం’ అని మంత్రి పొన్నం తెలిపారు.
Read Also: హైవేలే టార్గెట్.. ఆదమరిచారో బంగారం అంతే సంగతి
Follow Us On : WhatsApp


