కలం, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 (Under 19) వరల్డ్ కప్‌కు అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. ప్రత్యర్థులను పడగొట్టే వ్యూహాలను రచిస్తూ, టీమ్ ఫార్మేషన్‌పై కుస్తీలు పడుతూ సమాయత్తం అవుతున్నాయి. అండర్-19 వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు తలపడనున్నాయి. యువ క్రికెట్ ప్రపంచకప్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. ఇది అండర్-19 (Under-19) ప్రపంచకప్ 16వ ఎడిషన్. ఈ టోర్నీలో 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి మొత్తం 41 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. గ్రూప్ దశ అనంతరం సూపర్ సిక్స్, సెమీఫైనల్స్, ఫైనల్‌తో విజేతను నిర్ణయిస్తారు.
గ్రూపుల వివరాలు
గ్రూప్–ఏ
ఈ గ్రూప్‌లో టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు భారత్ ఉంది. ఐదు సార్లు విజేతగా నిలిచిన భారత్‌తో పాటు 2020 చాంపియన్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా జట్లు ఉన్నాయి.
గ్రూప్–బీ
సహ ఆతిథ్య దేశం జింబాబ్వేతో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ప్రారంభ దశలోనే ఆసక్తికరమైన పోరాటాలు జరిగే అవకాశం ఉంది.
గ్రూప్–సీ
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఈ గ్రూప్‌కు అగ్రశ్రేణిగా ఉంది. శ్రీలంక, ఐర్లాండ్, జపాన్ జట్లు కూడా ఇందులో భాగం.
గ్రూప్–డి
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, టాంజానియా జట్లతో ఈ గ్రూప్ పూర్తి అయింది.
అండర్-19 ప్రపంచకప్–2026 జట్ల వివరాలు
గ్రూప్–ఏ
ఆస్ట్రేలియా:
ఒలివర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే, జేడెన్ డ్రాపర్, బెన్ గార్డన్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, జాన్ జేమ్స్, చార్లెస్ లాక్‌మండ్, విల్ మలాజ్చుక్, నితేశ్ స్యామ్యూల్, హేడెన్ షిల్లర్, ఆర్యన్ శర్మ, విలియం టేలర్, అలెక్స్ లీ యంగ్
ఐర్లాండ్:
ఒల్లీ రైలీ (కెప్టెన్), రూబెన్ విల్సన్, అలెక్స్ ఆర్మ్‌స్ట్రాంగ్, కాలమ్ ఆర్మ్‌స్ట్రాంగ్, మార్కో బేట్స్, సెబాస్టియన్ డైక్స్ట్రా, థామస్ ఫోర్డ్, స్యామ్యూల్ హాస్లెట్, ఆడమ్ లెకీ, ఫెబిన్ మనోజ్, ల్యూక్ ముర్రే, రాబర్ట్ ఓబ్రియన్, ఫ్రెడీ ఓగిల్బీ, జేమ్స్ వెస్ట్, బ్రూస్ వేలీ
రిజర్వులు: పీటర్ లే రూక్స్, విలియం షీల్డ్స్
జపాన్:
కజుమా కాటో-స్టాఫర్డ్ (కెప్టెన్), చార్లెస్ హారా-హింజ్, గాబ్రియెల్ హారా-హింజ్, మాంట్గొమరీ హారా-హింజ్, కైసీ కొబయాషి-డాగెట్, టిమోతి మూర్, స్కైలర్ నకయామా-కుక్, ర్యుకి ఓజెకి, నిహార్ పర్మార్, నిఖిల్ పోల్, చిహయ సెకినె, హ్యుగో టానీ-కెల్లీ, సందేవ్ ఆర్యన్ వడుగే, కై వాల్, టేలర్ వా
శ్రీలంక:
విమత్ దిన్సార (కెప్టెన్), కవిజ గమేజ్, దిమంత మహావిథాన, విరాన్ చముదిత, దుల్నిత్ సిగేరా, చమిక హీన్తిగల, ఆడమ్ హిల్మీ, చమరిందు నేత్సర, సేత్మిక సెనెవిరత్నె, కుగతాస్ మతులన్, రసిత్ నిమ్సర, విగ్నేశ్వరన్ ఆకాష్, జీవంత శ్రీరామ్, సెనుజ వెకునగోడ, మలింత సిల్వా
గ్రూప్–బీ
బంగ్లాదేశ్:
అజీజుల్ హకీమ్ తమీమ్ (కెప్టెన్), జవాద్ అబ్రార్, సమీయున్ బాసిర్ రతుల్, షేక్ పర్వేజ్ జిబోన్, రిజాన్ హోస్సాన్, షహరియా అల్ అమిన్, షాదిన్ ఇస్లాం, ఎం.డి. అబ్దుల్లా, ఫరీద్ హసన్ ఫైసల్, కాలం సిద్ధికీ అలీన్, రిఫాత్ బెగ్, సాద్ ఇస్లాం రాజిన్, అల్ ఫహద్, షహ్రియార్ అహ్మద్, ఇక్బాల్ హోస్సైన్
రిజర్వులు: అబ్దుర్ రహీమ్, దేవాశిష్ సర్కార్ దేబా, రఫీ ఉజ్జమాన్ రఫీ, ఫర్హాన్ షహ్రియార్, ఫర్జాన్ అహ్మద్ అలీఫ్, సంజిద్ మజుందర్, ఎం.డి. సోబుజ్
భారత్:
ఆయుష్ మాథ్రే (కెప్టెన్), ఆర్.ఎస్. అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఎనాన్, ఆరన్ జార్జ్, అభిగ్ఞాన్ కుండు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వంశ్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది
న్యూజిలాండ్:
టామ్ జోన్స్ (కెప్టెన్), మార్కో ఆల్పే, హ్యుగో బోగ్, హ్యారీ బర్న్స్, మేసన్ క్లార్క్, జాకబ్ కాటర్, ఆర్యన్ మాన్, బ్రాండన్ మత్సోపోలస్, ఫ్లిన్ మోరీ, స్నేహిత్ రెడ్డి, కాలమ్ సాంసన్, జస్కరణ్ సంధు, సెల్విన్ సంజయ్, హంటర్ షోర్, హ్యారీ వైట్
అమెరికా:
ఉత్కర్ష్ శ్రీవాస్తవ (కెప్టెన్), అద్నిత్ ఝాంబ్, శివ్ షానీ, నితీష్ సుదిని, అద్వైత్ కృష్ణ, సాహిర్ భాటియా, అర్జున్ మహేశ్, అమ్రీందర్ గిల్, సబ్రిష్ ప్రసాద్, ఆదిత్ కప్పా, సాహిల్ గార్గ్, అమోఘ్ రెడ్డి అరేపల్లి, రిత్విక్ అప్పిడి, రయాన్ తాజ్, రిషభ్ షింపి.
Read Also: అంతా నా తలరాత.. వేటుపై గిల్
Follow Us On: Instagram


