కలం, వెబ్ డెస్క్: మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్న బీజేపీ నేతలు నెహ్రూను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. భారత తొలి ప్రధాని నెహ్రూ వేసిన పునాది మేరకే దేశం నేడు అభివృద్ధి చెందిదన్నారు. ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు ఆహార ధాన్యాల కొరత ఉండేదని గుర్తు చేశారు. కనీసం గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుచూపుతో నెహ్రూ అభివృద్ధి చేశారన్నారు.
నెహ్రూ (Nehru) కంటే మోదీ ఎక్కువ కాలం పాలన చేసి ఉండవచ్చని, అది అభినందించదగ్గ విషయమేనని పొన్నం అన్నారు. నెహ్రూ నాడు ఏర్పాటు చేసిన విద్యా, వైద్య ప్రాజెక్టుల వల్లనే దేశం ఇంత అభివృద్ధి చెందిందన్నారు. నెహ్రూను అవమానిస్తున్న పురంధేశ్వరి, ఇతర బీజేపీ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
భారత్ నుంచి ఆహార ధాన్యాలు ఇత దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నా… వందలాది ఇతర దేశాల సీఈవోలు మన దేశంలో ఉన్నారన్నా.. కారణం నెహ్రూనే అన్నారు. మతం తప్ప ఇంకో మాట లేని, రాజ్యాంగాన్ని అవమానించే, ప్రతిపక్ష వ్యతిరేక నియంతృత బీజేపీకి నెహ్రూను విమర్శించే స్థాయి లేదన్నారు. ఉద్యోగ అంశాలు, కంపెనీలు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడం, దేశ స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ కారణమన్నారు. నాడు నెహ్రూ బలమైన ప్రతిపక్షం ఉండాలని ఆలోచిస్తే నేడు బీజేపీ అసలు ప్రతిపక్షం అనేదే ఉండకూడదన్నట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నెహ్రూను అవమానిస్తే చరిత్రను అవమానించినట్లేనని, ప్రజా స్వామ్యంలో ఇలాంటి తీరు పనికి రాదని పొన్నం (Minister Ponnam) హితవు పలికారు.
Read Also: మెట్రో ఫుట్‌పాత్‌ల లీజుపై హైకోర్టు ఆగ్రహం.. GHMCకి నోటీసులు
Follow Us On : WhatsApp

