కష్టపడే వారికి కాంగ్రెస్‌లో సముచిత స్థానం: యెన్నం శ్రీనివాసరెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో నామమాత్ర స్థానం కాదు, గౌరవప్రదమైన స్థానం ఉంటుందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పసుల రాజుకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నమ్మిన వారిని ఎప్పటికీ నిరాశపరచదని స్పష్టం చేశారు. పార్టీ అందరినీ సమాన దృష్టితో చూసుకుంటుందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌కు సూచించారు. ప్రజల పక్షాన నిలబడి సేవ చేస్తే వారికి ఎప్పటికైనా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, కార్పొరేటర్లు ప్రవీణ్, అవేజ్, ప్రశాంత్, పెద్ద గొల్ల నర్సింహులు, నాయకులు రియాజుద్దిన్, యాదయ్య, సల్మాన్, అబ్దుల్ హక్ డాక్టర్ రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: మెట్రో ఫుట్‌పాత్‌ల లీజుపై హైకోర్టు ఆగ్రహం.. GHMCకి నోటీసులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>