కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ (TGSRTC) కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎలాగైనా సమ్మె విరమింపజేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆర్టీసీ కార్మికుల ముందు కొన్ని కీలక ప్రతిపాదనలు ఉంటాచరు. వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని పేర్కొన్నారు.
డిమాండ్ల పరిశీలనకే కమిటీ
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి అంశాలు విన్నవిస్తే కచ్చితంగా వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ‘65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ బస్సు ప్రయాణం పేద ప్రజలకు లైఫ్ లైన్. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం. ఎలాంటి బేషజాలకు పోకుండా అధికారుల కమిటీ సమస్యలు విన్నవించుకోవచ్చు. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.’ అంటూ పొన్నం (Ponnam Prabhakar) పేర్కొన్నారు. మరి కార్మిక సంఘాలు పొన్నం ప్రభాకర్ చేసిన మనవిని పరిగణనలోకి తీసుకుంటాయా? ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి సమ్మెను విరమిస్తాయా? లేదంటే సమ్మె కొనసాగిస్తాయా? అన్నది వేచి చూడాలి.
Read Also: అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ ?
Follow Us On: Instagram

