బూర్గంపాడులో షాకింగ్ ఘటన.. ఐటీసీలో లారీ ప్రమాదం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలోని ఐటీసీ కర్మాగారం (ITC Factory)లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ లైన్ వాటర్ పైప్‌ను లారీ బలంగా ఢీకొట్టడంతో ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారం ప్రకారం, మృతుడు ముసలిమడుగు గ్రామానికి చెందిన తంబి అని తెలుస్తోంది.

ప్రమాద తీవ్రతతో పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో కర్మాగార పరిసర ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయి కలకలం రేపింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ ?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>