‘సర్’ పేరిట ఓట్లు తొలగించే కుట్ర: మంత్రి పొన్నం ప్రభాకర్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓట్లు తొలగించే కుట్ర చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో అర్హులైన వారి ఓట్లను తొలగించే ప్రక్రియ సాగిందన్నారు. ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లిన వారి ఓట్లను కూడా తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. మకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనుకునే ప్రతి ఒక్కరి ఓటును తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రతి బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని స్థానిక నాయకత్వంతో కలిసి ఓట్ల పరిశీలన చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని వివరించారు.

బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం..

రాష్ట్రంలోని 34 వేల పైచిలుకు పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున ‘బూత్ లెవల్ ఏజెంట్ల’ నియామకం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుండి తొలగించబడకుండా చూడటమే దీని ఉద్దేశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని.. తమ వినతులను కచ్చితంగా పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>