కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల (Fuel Prices) పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్‌లో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో అనేక దేశాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 30 నుంచి 70 శాతం వరకు పెరిగాయని గుర్తు చేసింది.
అయితే భారత్‌లో మాత్రం గత 70 రోజులకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగానే కొనసాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు అనవసర ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించడంతో ధరల పెంపుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే కేంద్రం తాజా ప్రకటనతో చమురు ధరలపై పెంపుపై ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
Read Also: వైకల్యాన్ని ఎదిరించి.. కష్టాల కడలిని దాటి.. ఆదిలాబాద్ యువకుడి సక్సెస్ స్టోరీ!
Follow Us On : WhatsApp

