ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ ఆదేశం

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఫ్యూచర్ సిటీలో FCDA కార్యాలయం, స్కిల్స్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. కేరళం పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం హైదరాబాద్ చేరుకుని అధికారులతో కలిసి FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. FCDA కార్యాలయంతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన భవన సముదాయాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లో 20 ఎకరాల్లో రు.19 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయానికి గతేడాది సెప్టెంబర్‍లో సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు.

Read Also: రేవంత్ చేతుల మీదుగా ఇందిరమ్మ 5 గ్యారంటీస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>