Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీ పట్టివేత

కలం, వలిగొండ: అక్రమంగా గోవులను తరలిస్తున్న ఒక లారీని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వలిగొండ (Valigonda) ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 05 యూసీ 6984 నంబర్ గల లారీలో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గోసంరక్షకులు, బజరంగ్ దళ్ సభ్యులు సమాచారం అందించారు. ఈ క్రమంలో కాకినాడ నుండి జహీరాబాద్ వెళ్తున్న సదరు లారీని పోలీసులు తనిఖీ చేయగా, అందులో సుమారు 50 గోవులను గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించి జియాగూడ గోశాలకు తరలించారు. ఈ ఘటనపై లారీ డ్రైవర్, క్లీనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Read Also: మొయినాబాద్‌ డ్ర‌గ్స్ పార్టీ కేసులో మ‌రో ట్విస్ట్‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>