గంగుల సమక్షంలో మున్నూరు కాపు సంఘం కొత్త కమిటీ

కలం, కరీంనగర్ బ్యూరో: గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangam) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం కరీంనగర్‌లోని ఓ వేడుక మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను గంగుల కమలాకర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంఘం అభివృద్ధి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యతతో, అంకితభావంతో పనిచేయాలని గంగుల కమలాకర్ సూచించారు. మున్నూరు కాపు సంఘం మరింత అభివృద్ధి సాధించేలా కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్ట పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>