కంటి చుక్కల్లోనూ కల్తీ..! ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ

కలం, వెబ్ డెస్క్ : పసిపిల్లలు తాగే పాల నుంచి ముసలివాళ్లు వాడే మందుల వరకు అన్నీ కల్తీ లిస్ట్ లో చేరిపోయాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఔషధాల రంగంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన సన్ ఫార్మా (Sun Pharma) కల్తీ భయంతో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఆ కంపెనీకి చెందిన 10 రకాల కంటి చుక్కల (Eye Drop) ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది.

ఈ మేరకు సన్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ లేఖ జారీ చేసింది. ప్రస్తుత బ్యాచ్‌లను విక్రయించవద్దని పంపిణీదారులను కోరినట్లు జాతీయ వార్త కథనాలు వెల్లడించాయి. అలాగే, లిస్ట్ లోని ఉత్పత్తికి సంబంధించి బిల్లింగ్ ను తక్షణమే నిలిపివేయాలని, అలాగే స్టాక్ వివరాలను అందించాలని కంపెనీ కోరింది. రోగి భద్రతే అత్యంత ప్రాధాన్యత అని, వారి శ్రేయస్సు కోసం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు సన్ ఫార్మా ప్రతినిధి వెల్లడించారు.

సన్ ఫార్మా వెనక్కి తీసుకున్న ఉత్పత్తులు లిస్ట్ ఇదే..

  • Depopred2ML
  • Brinolar (BKC Free)
  • Brinzotim Eye Drops 5ML BKC Free
  • Lotepred 5ML
  • Lotepred 1% Eye Drops SML
  • Lotepred LS 0.2%E/D5ML
  • Lotepred T
  • Nepalact OD Eye Drops 3ML
  • Nepalact-Z
  • Toba-F
  • Nepalact E/D 5ML
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>