కలం, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల మార్చి 15న ఆదివారం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఈవెంట్ ఆర్గనైజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహించుకోవడానికి పోలీసులు 1,500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా.. 5,000 మందికిపైగా అభిమానులు తరలివచ్చారు.
అనుమతికి మించి భారీ ఎత్తున జన సమీకరణ జరగడంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వైపు వెళ్లే రోడ్లన్నీ గంటల తరబడి స్తంభించాయి. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లఘించిన ఆరోపణలతో మూవీ (Ustaad Bhagat Singh) ఈవెంట్ ఆర్గనైజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వయోలెన్స్ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి
Follow Us On : WhatsApp

