Mobile Popup Ad
Mobile Popup Ad

మొయినాబాద్‌ డ్ర‌గ్స్ పార్టీ కేసులో మ‌రో ట్విస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మొయినాబాద్‌ డ్ర‌గ్స్ పార్టీ (Moinabad Drugs Party) వ్య‌వ‌హారంలో మ‌రో ఆస‌క్తిక‌ర అంశం చోటు చేసుకుంది. ఫామ్‌హౌస్‌లో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌కు సంబంధించి ముగ్గురిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. పైల‌ట్‌ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, న‌మిత్ శ‌ర్మాల‌పై కేసులు న‌మోద‌య్యాయి. డ్ర‌గ్స్, ఆర్మ్స్ యాక్ట్, హ‌త్యా య‌త్నం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌న్‌తో కాల్పులు జరిపినందుకు బీఎన్ఎస్ 109 సెక్ష‌న్ కింద కేసు న‌మోదైంది. ఈ ముగ్గురి క‌స్ట‌డీ కోరుతూ పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ క‌స్ట‌డీలో అనేక అంశాల‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం నియ‌మించిన సిట్ అధికారులు నేడు భేటీ కానున్నారు. సిట్ డ్ర‌గ్స్ పార్టీపై లోతుగా విశ్లేషిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Read Also: నేడు కేంద్ర కేబినెట్ భేటీ: ఇంధన ధరలపై కీలక నిర్ణయం !

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>