Mobile Popup Ad
Mobile Popup Ad

భగీరథ్‌ను వారం రోజులు కస్టడీకి ఇవ్వండి.. కోర్టును కోరనున్న పోలీసులు!

కలం, వెబ్ డెస్క్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను (Bandi Bhagirath) వారం రోజుల పాటు తమ కస్టడీకి (Custody) అప్పగించాలని కోరుతూ పోలీసులు నేడు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. అఘాయిత్యాలు జరిగిన సమయంలో ఉన్న భగీరథ్ స్నేహితులను ఇప్పటికే దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అలాగే, ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా ప్రశ్నించి మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భగీరథ్‌ను (Bandi Bhagirath) కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు నిర్ణయించారు. నిన్ననే ములాఖాత్ ద్వారా భగీరథ్‌ను అతని తల్లి జైల్లో కలిసి మాట్లాడారు.

Read Also: చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు.. వయసు పెరిగినా చురుగ్గా ఉంచే ‘మైక్రో హాబిట్స్’

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>