కలం, వెబ్ డెస్క్: ఆరోగ్యం (Health) అనేది కేవలం ఫుడ్, భారీ వ్యాయామాల వల్ల లభించేది కాదు. రోజువారి జీవితంలో చిన్న చిన్న అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది జీవనశైలిలో మార్పులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ జిమ్‌లకు వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం వంటి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. అయితే ఈజీగా చిన్న చిన్న అలవాట్ల (Micro Habits)తో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం, శరీరానికి సరిపడా నీరు తాగడం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి చిన్న మార్పులు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. జీవక్రియలను క్రమబద్ధం చేసి అంతర్గత ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఈ చిన్న అలవాట్లే (Micro Habits) దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే పెట్టుబడిగా మారుతాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో గడపడం, ఐదు నిమిషాల పాటు స్ట్రెచింగ్ చేయడం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తద్వారా కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగవంతం అవుతుంది. కాలుష్యం, మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని ఇవి నివారిస్తాయి. క్రమం తప్పకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం వల్ల వయసు పైబడుతున్నా శరీరం చురుగ్గా ఉంటుంది. అలాగే బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గిస్తుంది.
Read Also: పుచ్చకాయ తింటే చనిపోతారా? వైరల్ వార్తలపై డాక్టర్ల క్లారిటీ!
Follow Us On: WhatsApp

