Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద్యోగుల వివరాలన్నీ డిజిటల్.. మే 31 లోపే గడువు!

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఫైళ్ళ మూవ్‌మెంట్‌కు ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని తీసుకొచ్చినట్లుగానే ఇప్పుడు ఉద్యోగుల (Telangana Employees) వివరాలన్నింటినీ డిజిటల్ పద్ధతిలోనే నిర్వహించాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 31 లోగా ఉద్యోగులందరి వివరాలు మాన్యువల్ పద్ధతి నుంచి డిజిటల్‌లోకి (Digital)  మారేలా అప్‌‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. పరిపాలనలో స్పీడ్, పారదర్శకత, జవాబుదారీతనం, రియల్ టైమ్ యాక్సెస్.. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగుల పే-రోల్ ప్రాసెసింగ్, ఈ-పెన్షన్, లీవ్ మేనేజ్‌మెంట్, ఎంప్లాయీ కెరీర్ ట్రాకింగ్.. ఇవన్నీ డిజిటల్ పద్ధతిలోనే జరుగుతాయన్నారు.

ఇప్పటివరకూ ఉద్యోగుల (Telangana Employees) సర్వీస్ రిజిస్టర్లు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నామని, ఇక నుంచి డిజిటల్ మోడ్‌లోకి మారుతాయని జీఏసీ విభాగం సెక్రటరీ శిక్తా పట్నాయ్ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పేరుతో నడిచే ఈ డిజిటల్ పద్ధతిలోకి సర్వీస్ రిజిస్టర్ వివరాలన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, అన్నింటినీ స్కానింగ్ చేసి ఈ నెల 31 లోగా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల హెచ్ఓడీలు, ఉన్నతాధికారులు, వారిని సచివాలయం నుంచి పర్యవేక్షించే ఆయా శాఖల అధికారులు ఈ ప్రక్రియకు ప్రాధాన్యత ఇచ్చి డెడ్‌లైన్‌లోగా పూర్తయ్యేలా చూడాలన్నారు.

Read Also: బీజేపీలో కొత్త సంక్షోభం.. నేతలకు కీలక ఆదేశాలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>