నా చావుకు ఆ నలుగురే కారణం.. రాజ్ కుమార్ సూసైడ్ నోట్

కలం, వెబ్ డెస్క్: షాబాద్ (Shabad) ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ తాను చనిపోవడానికి ముందు రాసుకున్న నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాండ్ పేపర్ మీద నాలుగు పేజీల నోట్ రాయడం సంచలనంగా మారింది. ‘నా చావుకు ఆ నలుగురే కారణం. ఇంటి పక్కన ఉన్న అమ్మాయి నన్ను ప్రేమించినట్లు నటించింది. ఏడాదిన్నర డబ్బుల కోసం చాలా వేధిస్తోంది. వాళ్ల నాన్న బతికి ఉన్నప్పుడే మా విషయం ఇంట్లో వాళ్లకు తెలుసు. బాగా చర్చ జరిగింది. వాళ్లకు ఉన్న మూడున్నర లక్షలు అప్పు తీర్చాలని ఒత్తిడి చేశారు. నా ఫోన్ ఇవ్వాలని అమ్మాయి చాలా ఒత్తిడి చేసింది. అమ్మాయి రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్తుండేది. నా మీద కేసు పెట్టి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు ఇస్తేనే కేసు విత్ డ్రా చేసుకుంటామని బెదిరించారు’ అని అందులో పేర్కొన్నాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>