నిజమాబాద్​ జిల్లాలో రెచ్చిపోతున్న ‘మొరం’ మాఫియా.. జేసీబీలు, ట్రాక్టర్లు సీజ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో మొరం మాఫియా రెచ్చిపోతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. మొరం అక్రమ రవాణాకు చెక్ పెడటం లేదు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మొరం (illegal Soil) అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం CCS ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది ధర్పల్లి పరిధిలోని మైలారం పెద్ద వాగు ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. అనుమతులు లేకుండా అక్రమంగా మొరం రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించారు.

తవ్వకాలకు ఉపయోగిస్తున్న 2 జేసీబీలు, 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతోంది. వాగులు, చెరువులు పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడే ముప్పు ఉంది. ఈ కారణంగా పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను చట్టపరమైన చర్యల కోసం ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓకు అప్పగించారు. సంబంధిత వ్యక్తులపై మైనింగ్ ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>