పార్టీ మారిన నేతలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ఏ నిర్ణయం తీసుకున్నా దానిని తాను స్వాగతిస్తానంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టు పట్టింది. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీలు మారిన నేతలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు.
ఈ నోటీసులకు బదులిచ్చిన ఎనిమిది మంది నేతలు తాము పార్టీ మారలేదని చెప్పారు. ఆ తర్వాత ఫిరాయింపు నేతలతో అసెంబ్లీలో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించారు స్పీకర్. తాజాగా ఈ అంశంపై పోచారం స్పందించారు. తనకు కేసీఆర్ అందించిన సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. ‘‘రేవంత్ నాకు మంచి స్నేహితుడు. నా నియోజకవర్గ అభివృద్ధిపై రేవంత్ హామీ ఇచ్చారు. అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఏదైనా నేను సిద్ధం’’ అని పోచారం(Pocharam Srinivas Reddy) స్పష్టం చేశారు.

