అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న ఓ భారతీయుడికి అక్కడ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఒకే సారి రెండు ఉద్యోగాలు(Moonlighting) చేస్తున్నాడన్న కారణంగానే అతనికి కోర్టు శిక్ష విధించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న మెహుల్ గోస్వామి(39) అనే వ్యక్తి కంపెనీకి తెలియకుండా మరోచోట కాంట్రాక్టర్‌గా కూడా ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతని(Mohul Goswami)ని అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు.. అతనిని కోర్టు ముందు హాజరుపరిచారు. సాక్షాధారాలు పరిశీలించిన న్యాయస్థానం మెహుల్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Read Also: స్పీకర్ నిర్ణయం ఏదైనా నాకోకే..: పోచారం

