బెంగాల్‌లో క‌మ‌లం విక‌సించింది.. ఫ‌లితాల‌పై మోదీ ఆనందం!

క‌లం, వెబ్ డెస్క్: ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. బీజేపీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బెంగాల్‌లో క‌మ‌లం విక‌సించింద‌ని మోదీ త‌న పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్ర‌జా శ‌క్తి గెలిచింద‌ని, బీజేపీ సుప‌రిపాల‌న‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ అద్భుత విజ‌యం అందించిన బెంగాల్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. బెంగాల్ ప్ర‌జ‌ల‌ కలలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం దక్కేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.

Read Also: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>