Mobile Popup Ad
Mobile Popup Ad

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా: కలెక్టర్

కలం, ఖమ్మం బ్యూరో: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా మెగా జాబ్ మేళా (Mega Job Mela) నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర (Collector Divakara) తెలిపారు. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఖమ్మం (Khammam) నగరంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ తదితర రంగాలకు చెందిన 80 కంపెనీలు పాల్గొని సుమారు 3,200కు పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

సోమవారం ఎంపికైన అభ్యర్థులకు మే 23న నియామక పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు. మన లక్ష్యాలపై దృష్టి ఉంచుకుంటూనే ప్రస్తుతం లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉండకుండా, ప్రారంభంలో వేతనం తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని స్వీకరించి అనుభవాన్ని సంపాదించు కోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగంలో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, నిరంతరం నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండాలని సూచించారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి రూ.12 వేల వేతనంతో ఉద్యోగాన్ని ప్రారంభించి 8 సంవత్సరాల్లో లక్షల్లో సంపాదిస్తున్నారని ఉదాహరణగా పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ.. మనకు ఇతర లక్ష్యాలు ఉన్నప్పటికీ ఇలాంటి అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఉద్యోగం ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుందని, అలాగే విలువైన అనుభవం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో (Mega Job Mela) జిల్లా అధికారులు, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, ఈడిఎం దుర్గాప్రసాద్, డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: కేరళంలో యూడీఎఫ్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>