కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన అధికారిక నివాసం 7-లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సీనియర్ కేంద్రమంత్రులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి తదితర సీనియర్ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువు రంగాల పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు.
ప్రధాని మోదీ (PM Modi) కీలక ఆదేశాలు
మిడిల్ ఈస్ట్‌లో (Middle East War) జరుగుతున్న ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమైంది. భారత్ కూడా గణనీయంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చించిన ప్రధాని మోదీ.. LPG, CNG సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రులు, అధికారుల్ని ఆదేశించారు. ధరల స్థిరీకరణ, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పెట్రోలియం, ముడి చమురు సరఫరా సరఫరా దెబ్బతినకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ఎరువుల ఉత్పత్తికి LNG కొరత లేకుండా చూడాలని.. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: రేవంత్‌రెడ్డి నాకు అన్యాయం చేశారు : జీవన్ రెడ్డి
Follow Us On: Youtube

