కలం/ఖమ్మం బ్యూరో : అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో భట్టి విక్రమార్క పాటు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty), ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అగ్నిప్రమాద ఘటన జరిగిన సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించి సమాచారం తెలుసుకున్నారు. నష్టపోయిన మిర్చి బాధితులతో మాట్లాడారు. శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం ఉన్న మిర్చి రైతులకు రూల్స్ ప్రకారం నష్టపరిహారం బీమా ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు. మధిర మార్కెట్ లో మిర్చి అమ్మకాలు, కొనుగోలు ఖమ్మం మాదిరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులకు సూచించారు.
Read Also: అసెంబ్లీలోకి మరో సంచలన బిల్.. రేపు క్యాబినెట్‌లో చర్చ
Follow Us On: X(Twitter)

