కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) సంచలన కామెంట్లు చేశారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో అవమానాలు భరిస్తున్నానని.. తనలాంటి కమిటెడ్ కార్యకర్తలు పార్టీలో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినా.. పార్టీ పట్టించుకోలేదని.. తన ఉనికిని దెబ్బ తీయడానికి చూస్తున్నారంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు.
తనకు అన్యాయం చేసిన వారిలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఉన్నారని.. ఆయనకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని జీవన్ రెడ్డి చెప్పారు. ‘నన్ను పక్కన పెట్టడానికే ఎమ్మెల్యే సంజయ్ ను తీసుకొచ్చారు. గత 20 నెలలుగా జగిత్యాలలో సంజయ్ (MLA Sanjay) ఆధిపత్యమే కొనసాగుతోంది. ఎన్నో అవమానాలు భరిస్తున్నాను. ఢిల్లీ అధిష్టానం దాకా ఈ విషయాలను తీసుకెళ్లాను. కానీ ఎవరూ నా ఆవేదన లెక్క చేయట్లేదు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని జీవన్ రెడ్డి (Jeevan Reddy) స్పష్టం చేశారు.
Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!
Follow Us On: Instagram

