కలం, మెదక్ బ్యూరో : ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల యుద్ధం కారణంగా యూరియా కొరత వచ్చే అవకాశం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నర్మెట్ట రైతు ఉత్సవాల్లో సీఎం మాట్లాడుతూ.. రామగుండంలో తయారయ్యే యూరియా మొత్తం రాష్ట్రానికి కావాలని బీజేపీ ఎంపీ రఘునందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ప్రధాని మోదీని కలుస్తామన్నారు. ‘ప్రధాని మోడీ వస్తే నేను వస్తా.. నేను వస్తే ఎంపీ రఘునందన్ వస్తాడు. ఇది మంచి సంప్రదాయం. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదు. రఘునందన్ (Raghunandan Rao) ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడించాలని నేనే తిరిగాను. ఎన్నికల వరకే రాజకీయాలు.. అయిపోయాక అభివృద్ధి కోసం పని చేయాలి’ అని రేవంత్ చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అయినా కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో 3500 ఇండ్లు ఇచ్చామన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కావాలంటే తాను కొడంగల్ తీసుకుపోవచ్చు.. కానీ నేను అలా చేయలేదన్నారు. సిద్దిపేటపై (Siddipet) వివక్ష చూపలేదని, తాము పేదల కోసం పని చేస్తామని, రాజకీయాల కోసం పని చేయమని స్పష్టం చేశారు. వివక్ష గురించి తెలియాలంటే 2014 నుంచి కొడంగల్ కి ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకోవాలని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని ప్రకటించారు. మల్లన్నసాగర్ రైతుల కోసం ఆనాడు అండగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
Read Also: అసెంబ్లీలోకి మరో సంచలన బిల్.. రేపు క్యాబినెట్‌లో చర్చ
Follow Us On : WhatsApp

