కలం, వెబ్ డెస్క్: ఏపీకి ప్రధాని మోదీ (PM Modi) రాబోతున్న తరుణంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆగస్ట్ ఒకటో తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులతో కలిసి చర్చించారు.
రెండు గంటల పాటు పర్యటన..
ప్రధాని మోదీ రెండు గంటల పాటు భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అరగంట పాటు విమానాశ్రయం పనులు, ఇతర అంశాలపై సమీక్ష చేస్తారని వివరించారు.
అనంతరం, అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని స్పష్టం చేశారు. సుమారు 2 లక్షల మందితో ఈ సభను నిర్వహించబోతున్నామని.. ఉత్తరాంధ్రలో ఇప్పటివరకు జరిగిన సభల్లో ఇదే భారీగా ఉండబోతుందన్నారు. మంత్రులు తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

