భారత్‌ అల్లర్లపై షర్మిష్ఠ సంచలన జోస్యం.. నెట్టింట జోరుగా చర్చ

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశ రాజధానితోపాటు పలు ప్రాంతాల్లో చెలరేగుతున్న అల్లర్లపై ఓ మహిళా ఆస్ట్రాలజర్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయా? ఆమె చెప్పిందే జరుగుతోందా? అంటే ఔనని చెప్పక తప్పదు. ప్రముఖ ఆస్ట్రాలజర్ షర్మిష్ఠ (Astrologer Sharmistha) ఇటీవల ‘టైమ్స్ నౌ నవభారత్’కు చెందిన ‘న్యూస్ కీ పాఠశాల’ కార్యక్రమంలో యాంకర్ సుశాంత్ సిన్హాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోబోయే రాజకీయ, ఆర్థిక మార్పుల గురించి జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఏడాదిలో మొదటి 6 నెలలు భారత్ దేశానికి, ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. స్టాక్ మార్కెట్లతో పాటు దేశ రాజకీయాల్లో అనిశ్చితి వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.

చివరి 6 నెలల్లో మాత్రం దేశం కోలుకుని మెరుగుపడుతుందని ఆమె (Astrologer Sharmistha) ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిష్ఠ జోస్యంతో దేశ భద్రత, శాంతిభద్రతల విషయంలో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ఆమె జోస్యంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రభుత్వం ఈ పరిస్థితులను అధిగమించగలదా? అని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మోదీ ప్రభుత్వానికి శాంతిని నెలకొల్పడంతో కష్టసాధ్యమైన పనిగా మారుతుందేమోనని మరికొందరు కామెంట్లు చేశారు.

Read Also: నిరసనల సెగ.. అక్కడ రెస్టారెంట్లు, ఆఫీసులు క్లోజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>