కలం, వెబ్ డెస్క్ : భారత చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచే చోళ వంశానికి చెందిన అరుదైన చారిత్రక వస్తువులు తిరిగి భారత్‌కు చేరుతున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ (Netherlands) నుంచి చోళ యుగానికి చెందిన 11వ శతాబ్దపు కాంస్య తాళపత్రాలు (Copper Plates) భారత్‌కు తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టేతో కలిసి పాల్గొనడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పారు.
ఈ తాళపత్రాలు మొత్తం 21 పెద్దవి, 3 చిన్నవి ఉండగా, వాటిపై ఎక్కువ భాగం తమిళ భాషలో లిఖించబడినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇవి రాజేంద్ర చోళ I (Rajendra Chola), అతని తండ్రి రాజరాజ చోళ I మధ్య జరిగిన చారిత్రక ఒప్పందాలను నమోదు చేసినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. చోళుల సముద్ర శక్తి, సంస్కృతి, పరిపాలనా వైభవాన్ని ఈ తాళపత్రాలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం, లైడెన్ యూనివర్సిటీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 19వ శతాబ్దం నుండి ఈ అరుదైన వస్తువులను సంరక్షించినందుకు అభినందనలు తెలిపారు. ఈ పరిణామం భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో మరో ముఖ్య మైలురాయిగా భావించబడుతోంది.
Read Also: కాఫీ ఎక్కువగా తాగుతున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Follow Us On : WhatsApp

