ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం పరామర్శించారు. వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వారిని పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అంతేకాకుండా అందుతున్న సేవలు ఎలా ఉన్నాయని బాధితులను అడిగి తెలుసుకున్నారు. భూటాన్ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న వెంటనే.. ప్రధాని మోదీ బాధితులను కలవడం కోసం వెళ్లారు. భయపడొద్దని, వారికి కేంద్రం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాంబు పేలుడు క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అదేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగానే ఈ దాడి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని, అతి త్వరలోనే వారిని చట్టం ముందు నిలబెడతామని మోదీ(PM Modi) వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు బలగాలు రంగంలోకి దిగాయని, అన్ని కోణాల్లో దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నాయని చెప్పారు. దాంతో పాటుగానే దేశవ్యాప్తంగా ఉగ్ర మూలాల కోసం తనిఖీలను ముమ్మరం చేసినట్లు కూడా చెప్పారు.
Read Also: పేలుళ్ల ఘటనపై స్పందించిన అల్ ఫలాహ్ వర్సిటీ
Follow Us on : Pinterest

