ఆపరేషన్ సింధూర్ కు ఏడాది.. దేశ ప్రజలకు మోదీ కీలక పిలుపు

కలం, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సింధూర్ మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భారతీయులకు తమ సోషల్ మీడియా డీపీలను మార్చుకోవాలని కీలక పిలుపునిచ్చారు. భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన గుణపాఠం చెప్పిందన్నారు. వారి విజయాన్ని గౌరవిస్తూ ప్రతి భారతీయుడు ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ లలో తమ డీపీలను మార్చుకోవాలని ఎక్స్ వేదికగా కోరారు.

అలాగే, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ ను మార్చారు. ఆపరేషన్ సింధూర్ జ్ఞానపకార్థం రూపొందించిన చిత్రాన్ని డీపీగా పెట్టుకున్నారు. ప్రధాని మోదీని అనుసరిస్తూ కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ తో సహా పలువురు తమ డీపీలను మార్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>