Mobile Popup Ad
Mobile Popup Ad

మియాపూర్‌ ఫర్నిచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : మియాపూర్‌ (Miyapur) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. కల్వరి టెంపుల్ పక్కన ఉన్న ‘ఫర్నిచర్ హోమ్స్'(Furniture Homes) అనే ఫర్నిచర్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో షాప్‌లో ఉన్న సుమారు రూ.70 లక్షల విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మంటల తీవ్రత కారణంగా పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఏసీ అవుట్‌డోర్ యూనిట్లు కూడా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>