ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎంట్రీ.. లోకేశ్ హింట్ వీడియో

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి  నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?’ అంటూ లోకేశ్ చేసిన పోస్ట్‌తో పాటు ఒక బుల్లెట్ రైడ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్‌ రైడ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోందని లోకేశ్ హింట్ ఇచ్చారు. ఈ పోస్ట్‌తో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, పరిశ్రమల రాకపై ఆసక్తి మరింత పెరిగిందని నెటిజన్‌లు  స్పందిస్తున్నారు. మంత్రి లోకేశ్ చేసిన ఈ ‘బుల్లెట్ రైడ్’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>