పరకాలలో పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా పరకాల (Parkal) పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పరకాల పోలీసులు హరిజనవాడలోని బొమ్మకంటి పోచయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 బస్తాల్లో ఉన్న సుమారు రూ.22,500 విలువైన 7.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు పోచయ్యను అదుపులోకి తీసుకుని పరకాల పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>