5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 15వ తేదీ నుంచి అయిదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో అయిదు రోజుల పాటు పర్యటిస్తారని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొదట 15వ తేదీన యూఏఈకి వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్‌తో భేటీ అవుతారు. అక్కడి నుంచి నెదర్లాండ్స్ దేశానికి వెళ్లి.. ప్రధాని రాబ్ జెట్టన్‌తో సమావేశమవుతారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తారు. నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని స్వీడన్ దేశానికి వెళ్లి.. ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్‌తో సమావేశం అవుతారు. గొథెన్‌బర్గ్‌లో జరిగే వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. చివరగా.. మే 18న ఇటలీకి వెళ్లి మూడో ఇండియా–నోర్డిక్ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని జార్జ్ మెలోనీతో సమావేశమై.. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>