Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఫిక్స్

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) మే 9న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వేల కోట్ల రూపాయాల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రయాణికుల చిరకాల స్వప్నమైన ఎంఎంటీఎస్ రెండో దశలోని కీలక సెక్షన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అలాగే దాదాపు రూ. 1,399 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాల కనెక్టివిటీని పెంచేలా కొత్త నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు కాజీపేటలో ఏర్పాటు చేసిన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ప్రధాని మోదీ (PM Modi) పర్యటనను పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్రం తెలంగాణ కు చేస్తున్న సహకారంపై ప్రధాని మోదీ వివరించనున్నారు. అలాగే తెలంగాణలోని రాజకీయాలపై కూడా ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Read Also: టీఆర్ఎస్​ : లీగల్ చిక్కులు రాకుండా కవిత స్కెచ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>