Mobile Popup Ad
Mobile Popup Ad

నీతి ఆయోగ్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌.. కొత్త టీంకు ప్ర‌ధాని విషెస్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: భార‌త‌దేశ విధాన రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క పాత్ర పోషిస్తున్న నీతి ఆయోగ్ (NITI Aayog)ను కేంద్ర ప్ర‌భుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ నేప‌థ్యంలో సంస్థ కొత్త వైస్ చైర్మ‌న్‌గా ప్ర‌ముఖ ఆర్థిక వేత్త అశోక్ కుమార్ లాహిరిని నియ‌మిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) నిర్ణ‌యం తీసుకున్నారు. వీరితో పాటు రాజీవ్ గౌబా, ప్రొఫెస‌ర్ కేవీ రాజు, ప్రొఫెస‌ర్ గోబ‌ర్ధ‌న్ దాస్‌, ప్రొఫెస‌ర్ క‌రందిక‌ర్, డాక్ట‌ర్ ఎం శ్రీనివాస్‌ల‌ను నీతి ఆయోగ్ పూర్తికాల స‌భ్యులుగా నియ‌మించారు. స‌హ‌కార స‌మాఖ్య స్ఫూర్తిని పెంపొందించ‌డంలో, సంస్క‌ర‌ణ‌లు వేగ‌వంతం చేయ‌డంలో ఈ కొత్త బృందం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంద‌ని ఆకాంక్షించారు. ఈ కొత్త టీంకు ఈ సంద‌ర్భంగా మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Read Also: భద్రాచలం వద్ద 5 గ్రామాలను పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు కవిత సవాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>