Mobile Popup Ad
Mobile Popup Ad

టీఆర్ఎస్​ : లీగల్ చిక్కులు రాకుండా కవిత స్కెచ్​

కలం, తెలంగాణ బ్యూరో : జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటన చర్చనీయాంశంగా మారితే.. టీఆర్ఎస్​ పేరునే పార్టీకి పెట్టడం సంచలనంగా మారింది. తండ్రి కేసీఆర్​, అన్న కేటీఆర్​ పై నిప్పులు చెరుగుతూ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్​ఎస్​) పార్టీని ఆమె (TRS Chief Kavitha) ప్రకటించారు. అయితే, పార్టీ పేరు తర్వాత చిన్న అక్షరాల్లో ‘అసోసియేషన్’ అనే పదాన్ని తగిలించారు. ఆమె ప్రకటించిన ఈ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఖరారు చేయలేదు. ఎలాగూ ఆ పార్టీ పేరుతో ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేసేందుకు 30 రోజుల అవకాశాన్ని కమిషన్ ఇస్తుంది. పబ్లిక్ డొమైన్‌లో పార్టీ పేరును ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తుంది.

టీఆర్ఎస్ (TRS) అనే అబ్రివేషన్ వచ్చేలా పార్టీ పేరును ఎంపిక చేసుకున్నందున ఎవరి నుంచైనా అభ్యంతరాలు వస్తే లీగల్‌గా ప్రొటెక్షన్ ఉండేలా కంటికి కనిపించనంత చిన్న అక్షరాల్లో ‘అసోసియేషన్’ అనే పదాన్ని పెట్టుకున్నట్లు జాగృతి వర్గాల సమాచారం. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. ఒక స్వచ్ఛంద సంస్థకు లేదా సొసైటీకి, పొలిటికల్ పార్టీకి మధ్య తేడా ఉండేందుకు పార్టీ లేదా అసోసియేషన్ లేదా డెమొక్రటిక్ వంటి పదాలు పేరు చివరన ఉండాలి. అలాంటి నిబంధనలు, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే లీగల్ చిక్కుల్లేకుండా అసోసియేషన్ అనే పదాన్ని వాడుతున్నట్లు తెలిసింది.

Read Also: భద్రాచలం వద్ద 5 గ్రామాలను పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు కవిత సవాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>