అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarsimha) అన్నారు. శనివారం మంత్రి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో రేగోడు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అందోల్ మహేష్ కుటుంబ సభ్యులతో కలసి గృహ ప్రవేశం చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ వారికి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇల్లు లేని పేదలందరికీ దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మున్నూరు కిషన్, డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దిగంబర్ రావు, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సంగమేశ్వర్, సర్పంచ్ పర్విన్ చోటు మియా, పిర్యా నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆందోల్ (Andole) నియోజకవర్గం రేగోడు మండల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవాలలో మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Rajanarsimha) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేవాలయంలో ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న ఆయన.. స్వామివారిని దర్శించుకున్నాను. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మున్నూరు కిషన్, డాక్టర్స్ సెల్ చైర్మన్ డా రాజీవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావు, భాస్కర్ రెడ్డి, మారెల్లి సంగమేశ్వర్, గ్రామ సర్పంచ్ పర్వీన్ చోటుమియా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: శ‌వ రాజ‌కీయాలు వ‌ద్దు : మంత్రి పొన్నం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>