దేశం ముందున్న పెద్ద కల.. వికసిత్ భారత్ 2047 : ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండా ఆవిష్కరించారు. వరుసగా 13వ సారి ఎర్రకోటపై మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి మోదీ కీలక సూచనలు చేశారు. పెద్దకలలు కనాలని కోరారు. పెద్ద పెద్ద కలలు ఉంటే మన ఆలోచనలు కూడా పెద్దవవుతాయన్నారు.

గత 12 సంవత్సరాలల్లో దేశ వికాసం కోసం ఎంతో కృషి చేశామని. ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించామని చెప్పుకొచ్చారు. 12ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తోందని తెలిపారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విమక్తి చేశామని వివరించారు. దేశం వికసించాలనే సంకల్పం తీసుకున్నామని.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పా.

దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.. దేశాభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని మోదీ తెలిపారు. మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదని.. అలా, చేస్తే మన సామర్థ్యం పెరగదని చెప్పారు. మన ప్రయోజనాలను మనమే కాపాడుకున్నప్పుడే వికసిత్‌ భారత్‌ కల సాకారమవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>