హరీశ్ స్కామ్‌పై రేవంత్ రెడ్డికి ఎంక్వయిరీ చేసే దమ్ముందా?: కవిత

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు హరీశ్ రావు ఎప్పుడు వెన్నుపోటు పొడవటం తప్ప చేసిందేమీ లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రూ.100 కోట్ల స్కామ్ చేశారని అన్నారు. హరీష్ రావు 100 కోట్ల స్కామ్ పై ఎంక్వయిరీ చేసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.

సిద్దిపేటను కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మాదిరిగా కేసీఆర్, హరీశ్ రావు చేతిలో పెట్టారని కవిత అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావునుమంత్రిని కూడా చేశారని చెప్పారు. తాను సిద్దిపేటను ఉద్దరించారనని హరీశ్ రావు చెప్పుకుంటాడు కానీ.. ఆయన రాకముందు 120 రైస్ మిల్లులు ఉంటే ఇప్పుడు 20 కూడా లేవని మండిపడ్డారు. సిద్దిపేటలో పెద్ద కోమటోళ్ల వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీశారని.. పద్మశాలీలు నేసే చీరలను వాళ్లు దుకాణాల్లో పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి లేకుండా చేశాడని అన్నారు. ఈ మేరకు సిద్ధిపేట పర్యటనలో భాగంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి..

తెలంగాణ వచ్చాక సిద్దిపేటకు ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలని కవిత కోరారు. సిద్దిపేట్ కు ఇటు అటు చూస్తే కేసీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు లాంటి హేమహేమీలు ఉన్నారు కానీ.. నిజాం కట్టిన ఘన్ పూర్, సింగూర్ తప్ప మనకు ఏ ప్రాజెక్టులు లేవని అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేదుంటే.. అందులో ఉమ్మడి మెదక్ జిల్లాకే 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టుకు దాదాపు రూ.93 వేల కోట్లు ఖర్చు చేసి ఇచ్చింది మాత్రం లక్ష ఎకరాలు మాత్రమేనని విమర్శించారు.

కేవలం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక లో కలిసి లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఉమ్మడి మెదక్ లోని మిగతా నియోజకవర్గాలకు ఒక్క ఎకరాం కూడా నీళ్లు ఎందుకురావటం లేదు? అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న సరే వీటిని ఎందుకు పూర్తి చేయలేదో బీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. సిద్దిపేటకు తమ పార్టీ స్వాతంత్య్రం తెస్తోందని.. ప్రజలు తమను ఆశీర్వదించాలన్నారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>