భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశంలోని ప్రతి మహిళకు ఆత్మవిశ్వాసానికి చిహ్నమని ఆయన అభివర్ణించారు. బిహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన, “భారత పుత్రికలు ప్రపంచ వేదికపై చరిత్ర సృష్టించారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం” అని పేర్కొన్నారు. అదే సందర్భంగా ఆయన బిహార్(Bihar) రాజకీయ పరిస్థితులపై కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయే అంటే వికాసం (అభివృద్ధి), మహాగఠ్ బంధన్ అంటే వినాశనం (నాశనం) అని మోదీ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు మరోసారి ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని, ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోయే యువత తమ ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బిహార్ ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ, “నేను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు మఖానా బాక్స్‌లను కానుకగా అందజేశాను. ఇది బిహార్ కార్మికుల శ్రమకు నిదర్శనం. అలాగే కోసి నది వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది” అని చెప్పారు.
ఆర్జేడీ(RJD) పాలనలో చట్టం–వ్యవస్థ బలహీనపడిందని మోదీ విమర్శించారు. “జంగిల్‌రాజ్ కాలంలో పోలీసులు కూడా సురక్షితంగా లేరు. చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ సత్యపాల్‌సింగ్‌ను హత్య చేశారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదు” అని ప్రధాని(PM Modi) వ్యాఖ్యానించారు.
Read Also: ఆస్కార్ అవార్డులపై పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : Instagram

