రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుతం ఇండియా(India)లో పర్యటిస్తున్నారు. నేడు రష్యా(Russia), ఇండియా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. వాటిపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. చమురు, గ్యాస్, బొగ్గు, ఆహార భద్రత, ఆరోగ్య రంగం, లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలు జరిగాయి. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నా సరే ఇండియాకు చమురు సరఫరా కొనసాగుతుందని తేల్చి చెప్పారు పుతిన్(Putin). ఆర్థిక, భద్రతా రంగాల్లో కూడా పూర్తి సహకారం అందిస్తామన్నారు పుతిన్. వీటితో పాటు రష్యా దృష్టి సారించాల్సిన అంశాలపై మోడీ(PM Modi) కొన్ని సూచనలు చేశారు.
ఇరు దేశాల(India – Russia) మధ్య ఎప్పటికీ మిత్రుత్వం ఉంటుందన్నారు మోడీ. రెండు దేశాల మధ్య మైత్రి మరింత పెరగడంతో ట్రంప్ గురించే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇండియా రష్యా వద్ద చమురు కొనడాన్ని ట్రంప్ అస్సలు ఒప్పుకోవట్లేదు. రెండు దేశాలపై ప్రతీకార చర్యలు ఎలా తీసుకుంటున్నాడో చూస్తున్నాం. ఇండియా మీద విపరీతంగా టారిఫ్ లు పెంచడం, ఆంక్షలు విధించడం, హెచ్ 1బీ వీసాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇండియా మీద అత్యంత కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు ట్రంప్. అలాంటిది ఇప్పుడు కీలక ఒప్పందాలు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాడా.
పైగా ట్రంప్ ఏదైతే వద్దు అంటున్నాడో అదే చమురు విషయంలో కీలక ఒప్పందాలు చేసుకున్నాయి ఇండియా, రష్యా. అమెరికా ఆంక్షలు విధించినా చమురు సరఫరా ఆపేది లేదని పుతిన్, మోడీ ప్రకటించారు. ఈ దెబ్బతో ట్రంప్ కు నిద్ర పట్టదు. వెంటనే వేటిపై ఆంక్షలు విధిస్తాడో అనే టెన్షన్ మొదలైంది. తన మాట వినని దేశాలను ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నాడో చూస్తున్నాం. మరి ఇండియా మీద కొత్తగా ఏం నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.
Read Also: రాజసానికి కేరాఫ్.. హైదరాబాద్ హౌస్
Follow Us On: X(Twitter)


