భార‌త్‌-నెద‌ర్లాండ్ బంధంలో న‌వ శ‌కం.. ప‌ర్య‌ట‌న‌పై మోదీ స్పెష‌ల్ పోస్ట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: త‌న నెద‌ర్లాండ్స్ (Netherlands)ప‌ర్య‌ట‌న రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల‌కు స‌రికొత్త ఊపునిచ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఇరు దేశాల బంధాన్ని వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం స్థాయికి పెంచ‌డం ద్వారా స‌రికొత్త మైలురాయిని అధిగ‌మించామ‌ని తెలిపారు. నీటి వ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌, సెమీకండ‌క్ల‌ర్లు, ఆవిష్క‌ర‌ణ‌లు, ర‌క్ష‌ణ రంగం, స్థిర‌మైన అభివృద్ధి, మొబిలిటీ వంటి కీల‌క రంగాల్లో స‌హ‌కారాన్ని మ‌రింత విస్తృతం చేసుకుంటూ భ‌విష్య‌త్తు కోసం ఒక ప్ర‌తిష్టాత్మ‌క రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. త‌న ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యే త‌రుణంలో త‌న‌కు ఆతిథ్యం ఇవ్వ‌డంతో పాటు స్వ‌యంగా ఎయిర్ పోర్ట్‌కు వ‌చ్చి వీడ్కోలు ప‌లికిన నెద‌ర్లాండ్స్ ప్ర‌ధాని రాబ్ జెట్టెన్‌కు మోదీ థ్యాంక్స్ చెప్పారు.

రాబోయే రోజుల్లో భార‌త్‌, నెద‌ర్లాండ్స్ మైత్రి మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని మోదీ అన్నారు. ముఖ్యంగా జ‌ల వ‌న‌రుల నిర్వ‌హ‌ణ రంగంలో నెద‌ర్లాండ్స్ చేసిన అద్భుత‌మైన , విప్ల‌వాత్మ‌క‌మైన ప‌నుల‌ను మోదీ కొనియాడారు. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ స‌మాజం ఆ దేశం నుంచి ఎంతో నెర్చుకోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నెద‌ర్లాండ్స్‌లోని ప్ర‌సిద్ధ అఫ్స్లూ యిట్‌డైక్ జ‌ల ర‌క్ష‌ణ ప్రాజెక్టును మోదీ సంద‌ర్శించారు. దాని ప్ర‌త్యేక‌త‌ల‌ను, సాంకేతిక‌త‌ను స్వ‌యంగా ప‌రిశీలించిన‌ట్లు మోదీ తెలిపారు.నెద‌ర్లాండ్స్ ప‌ర్య‌ట‌న ద్వారా ల‌భించిన అనుభ‌వాలు, అక్క‌డి అత్యాధునిక టెక్నాల‌జీని భార‌త్‌కు తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. ఈ ఆధునిక సాంకేతిక‌త‌ను భార‌త్‌లో సాగునీటి రంగాన్ని బ‌లోపేతం చేయ‌డానికి, వ‌ర‌ద నియంత్ర‌ణ‌కు, అంత‌ర్గ‌త జ‌ల మార్గాల నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించ‌డానికి పూర్తిగా వినియోగిస్తామ‌ని మోదీ ధీమా వ్య‌క్తం చేశారు.

 Read Also: తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>