Mobile Popup Ad
Mobile Popup Ad

భారతీయుల కలలు చాలా గొప్పవి: ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: భారతీయులు తమ జీవన ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. పారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతీయులు పెద్ద పెద్ద కలలు కనడానికి భయపడరన్నారు. ఎందుకంటే, అవి చాలా శక్తివంతమైనవన్నారు. ఫ్రాన్స్‌ అనేది సిటీ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అని ప్రశంసించారు. గత 12 ఏళ్లలో భారత్ జీడీపీ రెట్టింపు అయ్యిందని.. మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలిచిందన్నారు. తయారీ రంగానికి హబ్‌గా భారత్‌ మారిపోయిందన్నారు. గత 12 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం భారత్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు. ఫ్రాన్స్–ఇండియా మధ్య సంబంధాలు చాలా బలోపేతం అయ్యాయని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>