Mobile Popup Ad
Mobile Popup Ad

సిరిసిల్లలో కేటీఆర్ వీకెండ్ ఎమ్మెల్యే.. కవిత ఘాటు వ్యాఖ్యలు

కలం, కరీంనగర్ బ్యూరో: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వీకెండ్ ఎమ్మెల్యే అని.. ప్రజల కోసం మాట్లాడే తీరిక ఆయనకు లేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సిరిసిల్లలో అట్టహాసంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. సిరిసిల్ల చౌరస్తాలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సెస్ ను తీసేసినా.. రైతు డిస్కం పెడతామన్న ఒక్క మాట మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడం బంద్ పెట్టాడని.. ఆయనను ప్రజలే పోరాటానికి సిద్ధం చేయాలని చెప్పారు.

కేటీఆర్.. సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకురాలేకపోయారని అన్నారు. అక్రమ సంపాదన కోసం నెరేళ్లలో ఎస్సీ, బీసీలను ఘోరంగా కొట్టించాడని ఆరోపించారు. వాళ్లకు అండగా ఉంటామన్న బండి సంజయ్, రేవంత్ రెడ్డి మోసం చేశారని ఫైర్ అయ్యారు. నెరేళ్ల బాధితులకు అండగా ఉండి తాము న్యాయం చేసి చూపిస్తామన్నారు. సిరిసిల్లలో సెస్ అనే సంస్థ ఉండేదని.. దాన్ని గవర్నమెంట్ లో కలిపేశారని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం డిస్కం ఏర్పాటు చేస్తామంటే కూడా దాని గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఆయన వీకెండ్ లో వచ్చి పోయే ఎమ్మెల్యే. తీరిక లేక మాట్లాడలేదేమో? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

కవిత కీలక వ్యాఖ్యలు..

సిరిసిల్ల నియోజకవర్గంలో కాళేశ్వరం నుంచి లక్షా 8 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే…480 ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీ ఎమ్మెల్యే నీళ్లు ఎందుకు తేలేదు?

వేములవాడలో ఇంకా 77 వేల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్లు రావాల్సి ఉంది.

సిరిసిల్ల అంటేనే అగ్గిపెట్టెలో చీరను నేసిన పద్మశాలీ ముద్దుబిడ్డల అడ్డా.

మీ ఎమ్మెల్యే ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తా, పద్మశాలీలకు న్యాయం చేస్తా అన్నాడు.

వర్కర్ టు ఓనర్ పథకం అన్నారు. దాన్ని పూర్తి చేయలేదు. అది చేసి ఉంటే ఎంతో మంది వర్కర్లు ఓనర్లు అయ్యే వారు.

సరైన ఉపాధి లేక ఇప్పటికీ చేనేతలు వేరే ఎక్కడో పనిచేసుకోవాల్సి వస్తోంది.

సిరిసిల్లలో కార్మికులు ఉంటే వేమువాడలో యారన్ డిపో పెట్టి రాజకీయం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు. ఆయనపై యుద్దం చేద్దామా?

మీ వీకెండ్ ఎమ్మెల్యే ను పోరాటం బంద్ చేసిండు.

పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద మాట్లాడిన చప్పుడు చేస్తలేడు.

ఆయనను మీరే యుద్ధానికి సిద్దం చేయాలి.

తెలంగాణలో సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారు.

తమ అక్రమ సంపాదన కోసం నెరేళ్లలో దళితులు, బీసీలను ఘోరంగా కొట్టారు.

అధికారం ఉందని మీ అక్రమ సంపాదన కోసం ఇష్టమొచ్చినట్లు బీసీలు, ఎస్సీలను కొడతరా?

9 ఏళ్లు అయిన సరే ఆ బిడ్డలకు న్యాయం జరగలేదు. ఇటీవలే వాళ్లు మమ్మల్ని కలిశారు.

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా వాళ్లను ఆదుకుంటామని చెప్పి పైసా సాయం చేయలేదు.

కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దగ్గర ఈ కేసు పెండింగ్ లో ఉంది. బండి సంజయ్ గారు ఈ కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలి.

మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఈ బిడ్డల కాళ్లు పట్టుకొని వాళ్లతో కేసు వేయించారు.

ఇప్పుడు వాళ్లు ఇబ్బందులు పడుతుంటే మీరు బుగ్గ కారులో తిరుగుతున్నారు.

రేవంత్ రెడ్డి కూడా వచ్చి నెరేళ్ల బాధితులను ఆదుకుంటామని చెప్పారు.

స్టేట్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్ద కూడా కేసు పెండింగ్ లో ఉంది. దాని విచారణ చేయించండి.

నెరేళ్ల బాధితులను ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారు.

రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ లకు అక్రమ సంపాదనతో కళ్లు మూసుకుపోయినయ్.

నా నెరేళ్ల బాధితులకు ఏ విధంగా అండగా ఉంటానో నేను చూపిస్తా.

వారం రోజుల్లో వాళ్లను కలుస్తా. వాళ్లకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తా.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని తెంపేసుకుంది.

పాంచజన్యం పేరుతో నేను ఐదు అంశాలను తీసుకున్నాను.

ధర్మం ఎటు వైపు ఉంటే అటు వైపు ఉండాలని అర్జునుడికి శ్రీ కృష్ణుడు చెప్పాడు.

మేము కూడా పాంచజన్యం పేరుతో ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకున్నాం.

సిరిసిల్లలో ఇప్పుడే మేము మొదటి అడుగు వేశాం.

ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే వరకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటా.

తెలంగాణ రక్షణ సేన అనే కొత్త పార్టీతో మీ ముందుకు వచ్చాను.

ఇప్పటికే ఇన్ని పార్టీలు ఉంటే ఇంకో పార్టీ ఎందుకు అని మా అక్క చెల్లెళ్లు అనుకోవచ్చు.

కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పేదలు, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది.

మనం పేగులు తెగేదాక కొట్లాడి, 12 వందల మంది బిడ్డలను పొగొట్టుకోని తెలంగాణ తెచ్చుకున్నాం.

కానీ ఇప్పటికీ పేదలు, మధ్య తరగతి పిల్లలకు చదువుకునేందుకు మంచి స్కూల్స్ లేవు.

గవర్నమెంట్ స్కూల్లో పంతులు ఉంటే స్కూల్ ఉండదు. స్కూల్ ఉంటే పంతులు ఉండడు.

ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం వెళితే పూర్తిగా దోపిడీ చేస్తున్నారు.

ఇక పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పార్టీ వాళ్లకే ఇచ్చుకున్నారు.

నిజమైన పేదలకు ఎవరైనా ఇళ్లు ఇచ్చారా?

ఇవ్వాళ నేను సిరిసిల్లకు వస్తుంటే ఆడబిడ్డలు వచ్చి మాకు ఇళ్లు కావాలని అడుగుతున్నారు.

నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరైనా మగ నాయకులు ఉంటే వాళ్లు అంత ధైర్యంగా అలా అడిగే వారా?

ఆడబిడ్డల కష్టం నాకు తెలుసు. వాళ్లకు ఏమీ కావాలో కూడా నాకు తెలుసు.

ఇంట్లో మగవాళ్లు పనిచేయకపోయినా సరే ఇంటిని నడిపేది ఆడవాళ్లే.

అందుకే మన పార్టీ జెండాలో ఆడవాళ్లకు ఎంతో పవిత్రమైన పసుపు రంగును పెట్టుకున్నాం.

మన పార్టీ జెండాలో ఉండే నీలం రంగు కూడా శ్రామికులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీలకు సూచిస్తుంది.

తెలంగాణలో పేదలు, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండవద్దని నేను పంతం పట్టాను.

అందుకే ఉచిత విద్య, వైద్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

అదే విధంగా యువతకు జాబ్ లు, ఉపాధి కావాలి. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు యువత కు ఉద్యోగాలు ఇవ్వటం లేదు.

మేము అధికారంలోకి వస్తే యువతకు స్వయం ఉపాధి లాంటి గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్లకు 2 నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం.

జాబ్ లు లేక ఇప్పటికీ యువత వాళ్ల అమ్మ నానల దగ్గర డబ్బు తీసుకోవటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇక రైతులకు గౌరవం పెరగాలి. అందుకే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ల కోసం మేము ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం.

ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు యూరియ కూడా దొరకటం లేదు.

యూరియ కోసం యాప్ తెచ్చారు. దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే యాప్ ను రద్దు చేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>