కలం, వెబ్ డెస్క్: అయోధ్య రామ మందిరం విరాళాల్లో అక్రమాలపై కాంగ్రెస్ (Congress) మరోసారి పార్లమెంట్ ఎదుట భారీ నిరసన చేపట్టింది. దీని వెనుక కుట్ర దారులు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కీలక నేతలు బ్యానర్లు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పకుండా పార్లమెంట్ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా వెంటనే సభకు వచ్చి.. ఈ అంశంపై ప్రకటన చేయాలన్నారు.
విద్యార్థులను కొట్టిందెవరు..?
ఇటీవల ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి విషయంలో కేంద్రం బాధ్యత వహించాల్సిందేనని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. వారిని కొట్టడానికి ఎవరు ఆదేశాలిచ్చారో.. దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని పక్కదారి పట్టించాలని చూస్తోందని.. జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

